ప్రేమ- రెండక్షరాల మాట
ప్రేమ ఎవరో చెప్పిన్నట్టు-ప్రేమ రెండక్షరాల మహాకావ్యం
ప్రేమ రెండు కన్నీటి చుక్కల మహాసముద్రం...
నిజమే! ఇది ఏ స్వార్ధంలేనప్పుడు-మంచి చెడుల విచక్షణ కోల్పోనప్పుడు.
బుద్ధి సక్రమంగావున్నప్పుడు....
కానీ......ప్రేమ స్వార్ధాన్ని కోరుకున్నప్పుడు.........
తన-మన,మంచి-చెడు,న్యాయం-అన్యాయం,మోసం-ద్వేషం మొదలైన గుణాల పై విచక్షణ కోల్పోతుంది....ప్రేమించినవాళ్లు తమకే కావాలనిపిస్తుంది....అలా కానీ పక్షంలో విచక్షణ నశిస్తుంది...బుద్ది వికటిస్తుంది.....ప్రేమించిన వాళ్ళ కోసం ఏమైనా ఏదైనా చేయాలనిపిస్తుంది.
ప్రేమంటే వికటించటం కాదు....ప్రేమంటే పరిపక్వత చెందడం .....
ప్రేమంటే అప్పుడే పూచిన పువ్వుల స్వచ్చంగా వుండాలి......
ప్రేమ రెండు హృదయాల కలయిక....ప్రేమంటే....త్యాగం,ప్రేమంటే గెలుపు,ప్రేమంటే ధైర్యం....ప్రేమంటే మంచితనం.
ప్రేమంటే ఆకర్షించటం కాదు......ఒకరినొకరు అర్ధం చేసుకోవటం....ఒకరిమీద ఒకరికి నమ్మకం.ఒకరినొకరు తమ చివరి శ్వాస దాక ఇష్టపడటం.
ఇదే నిజమైన ప్రేమకు చిహ్నం.
ప్రేమంటే ఒక అమ్మాయి-అబ్బాయి మద్య ఉండేదేనా మరి అమ్మ-నాన్న పంచె ప్రేమనేమంటారు.... ప్రేమంటే ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పకుండా బయట కలిసి తిరగటం కాదు.....వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయటం కాదు....ప్రేమ కోసం అమ్మ నాన్న దగ్గర అబద్దం చెప్పటం నిజమైన ప్రేమకాదు.మన ఆలోచనలకి తల్లితండ్రులు ఇచ్చే విలువ,వాళ్ళు మనపై పెట్టుకున్న నమ్మకానికి, వాళ్ళు మనపై చూపే ప్రేమకి కి కృతజ్ఞతగా మనం వాళ్ళ కిచ్చేది వారిపై అగౌరవం గా ప్రవర్తించటమా..... పిల్లలు ప్రయోజకులైతే మొదట సంతోషించేది తల్లితండ్రులే.......పిల్లలు అప్ప్రయోజకులైతే మొదట బాధపడేది తల్లితండ్రులే....తల్లితండ్రుల ప్రేమను గుర్తిదాం. ప్రేమకు నిజమైన నిర్వచనాన్ని ఇద్దాం... ప్రేమంటే మనం మాత్రమే బాగుండాలని కోరుకోవటం కాదు....ప్రేమంటే మనం-మన తల్లితండ్రులు,మనవాళ్ళందరూ బాగుండాలని కోరుకోవటం...అప్పుడే ప్రేమ పరిపక్వత చెందుతుంది.........పరిపక్వత చెందిన ప్రేమే జీవితాంతం నిలబడుతుంది....