Tuesday, January 25, 2011

62nd Republic Day...Make India Proud By Stopping Frauds ---Article-20

Aye Watan Aye Watan Humko Lyrics
Film: Shaheed (1965)
Singer: Rafi
Lyrics: Prem Dhawan
Music: Prem Dhawan
Aye vatan aye vatan hamako terii qasam
terii rAhon main jaan tak luTaa jaayenge
phuul kyaa chiiz hai tere kadamon pe ham
bhenT apane saron kii cha.Dhaa jaayenge
aye vatan aye vatan
koii panjaab se, koii mahaarAshhTr se
koii yuu pii se hai, koii bangaal se
terii puujaa kii thaalii men laaye hain ham
phuul har rang ke, aaj har Daal se
naam kuchh bhii sahii par lagan ek hai
jot se jot dil kii jagaa jaayenge
aye vatan aye vatan …

Saturday, January 22, 2011

Quotation by రంగనాయకమ్మ Article-19

             ప్రపంచంలో ఎక్కడ ఏ 'గురువు'ని చూసిన, ఏ 'తత్వవేత్త'ని చూసిన,ఏ 'సిద్ధాంతాన్ని'చూసిన  అది 'శ్రమ-సంబంధాల' గురించీ, ఆస్తి హక్కుల గురించీ,'కలిమి-లేమిల' గురుంచి ఏం చెపుతుందో చూడాలి.ఆ బోధన సమాజంలో ఏ పక్షాన నిలబడిందో గ్రహించాలి. అలా గ్రహించకపోతే, సమాజంలో ఏ విషయాన్నీఅర్ధం చేసుకోలేము. మన 'ఆత్మరక్షణ' మనం చేసుకోలేము.
            'గురువు'గానీ, 'నాయకుడు'గానీ బోధించిన విషయం లో సరైనదాన్ని తీసుకుని సరికాని దాన్ని తిరస్కరించాలి. తప్పుల్ని ఒప్పుల్ని ఒకే రకంగా భరించకూడదు.'ప్రేమ'అయినా,'భక్తి'అయినా విచక్షణా రహితంగా ఉండకూడదు.
                                                                                               Quotation is given by
                                                                                         -------రంగనాయకమ్మ-------

Sunday, January 16, 2011

నా మతం మానవత్వం Article-18

నా మతం మానవత్వం-My Religion Is Humanism
నా కులం మనిషి కులం-My Caste Is Human
అమ్మ మంచితనంతో బ్రతకమంది-Mother Told Me To Be Good
నాన్న ధైర్యంతో బ్రతకమన్నాడు-Father Told Me To Be Courage
నాకు మంచితనం,ధైర్యంతో పాటు నిజాయితీగా బ్రతకటం ఇష్టం-I Like To Be Good,Courage And Also With Courage
అందరు బాగుండాలని అనుకుంటాను-I Hope All Should Be Happy
నాకు నచ్చిన వాళ్ళ కోసం ఎంత రిస్కైన చేస్తా -I Do Any Risk For The Liked And Loved Ones

మంచి మాట Article-17

ఒంటికి అందం మంచి బట్టలు

మనసుకి అందం ఆహ్లాదకరమైన ఆలోచనలు

                మనకు కలిగే జయాపజయాల నుంచి మనం తెలుసుకోవలసినవి

                అపజయం నుంచి గుణపాటం-జయం నుంచి వినయం

నీ గతాన్ని దృష్టిలో పెట్టుకొని

నీ భవిష్యత్తును నిర్మించుకో

                తక్కువ సంపాదించేటప్పుడు పొదుపు చేయ్

                ఎక్కువ సంపదించేటప్పుడు తెలివిగా ఖర్చు పెట్టు

Saturday, January 15, 2011

నౌ ఆర్ నెవెర్ Article-16


పద పద పద పద పద నిన్ను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఎపుడు కానట్టే-ఇక్కడే నీవుంటే వున్నా లేనట్టే
నౌ ఆర్ నెవెర్
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు అదే మదిలో రేపుకి చోటు
(నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు-ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు)
ఇది సరిపోదంటు ఏదో సాదించాలంటూ - యదటలేని మరు నాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ
నౌ ఆర్ నెవెర్
నీతో నువ్వు కలహిస్తూ-నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టూ
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కథకిపుడే శ్రీకారం చుట్టూ
నౌ ఆర్ నెవెర్

Thursday, January 13, 2011

మరణం Article-15

              ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరు మరణిస్తూ వుంటారు.మరణం ప్రతి మనిషి జీవితానికి ముగింపు. నా జీవితం లో కూడా ఏదో రోజు మరణం తప్పదు..ఈ మరణం ఎవరి జీవితంలోకి ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు.
              నేను చావు గురుంచి ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఒకరోజు ఆలోచించాల్సిన పరిస్తితి వచ్చింది. మా నైనమ్మ చనిపోయినప్పుడు- ఆమె కష్టాలన్నీ తీరాయని అనుకున్నాను కానీ ఆమె చనిపోయినందుకు బాధపడలేదు. కానీ మా అన్నయ్య చనిపోయినప్పుడు మొదటిసారి బాధపడ్డాను.ఇంకా జీవితాన్ని సరిగా అనుభవించని వయసు...ఇంతేనా జీవితం అనిపించింది. పుట్టాం బ్రతికం చనిపోవడం ఇదేనా జీవితం అనిపించింది. అందుకే చనిపోయేలోగా ఏదో సాదించాలనిపించింది.ప్రేమ ఆప్యాయత ఆస్తి అంతస్తులు డబ్బు తాత్కాలికం అనిపించింది. మనిషి పుట్టేటప్పుడు ఏమి లేకుండా పుడతాడు.కానీ చనిపోయేటప్పుడు తనకు మిగిలేది తన పేరు ఒక్కటే. ఆ పేరు చనిపోయాక కూడా చిరస్తాయిగా ఉండేలా బ్రతకాలని అనిపించింది. కేవలం ఆ పేరుకోసం కొనాళ్ళు బ్రతికిన చాలనిపించింది. చావు నాదగ్గరకి వచ్చేటప్పటికి నేను ఉన్నత స్థానంలో వుండాలి.....ఇదే నా లక్యం,నా గమ్యం.

Tuesday, January 11, 2011

వ్యక్తిత్వం Article-14

                  మనిషికి వ్యక్తిత్వం ముఖ్యమైంది.ఒక వ్యక్తి యొక్క విలువను తెలిపేది వ్యక్తిత్వం. క్యారెక్టర్ అనేది  మనిషి లోని క్వాలిటీ ని తెలియజేస్తుంది. మన దేశ దురాచారాలను మూఢనమ్మకాలను పక్కనపెడితే, మన సంస్కృతి సంప్రదాయాలు కటినంగా ఉన్నప్పటికీ  మనుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాల కోసం,మనుషులకు మంచి వ్యక్తుత్వాల కోసం మన పూర్వికులు రూపొందించినవి. ఒకప్పుడు  మనిషి గొప్పగా బ్రతకాలి అనుకునేవాడు. మన దేశ స్వతంత్రం కోసం నిస్వార్థంగా పోరాడిన ఎంతో మంది నాయకుల  వ్యక్తిత్వాలు ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేసాయి. ఏదో సాదించాలానే తపనతో నిజాయితిగా బ్రతకడమే మంచి వ్యక్తిత్వానికి సరైన రూపం.
                  కానీ ఈరోజు నేటి యువత తమ వ్యక్తిత్వాలను సరైన పద్దతిలో కాకుండా వారి మనసుకుతోచినట్టు తమ స్వార్ధ బుద్దితో,వారి క్షనికావేసాల కోసం,తమ ఆనందాల కోసం తమని తామే పాడుచేసుకుంటున్నారు.తమ కోరికలు తీర్చుకోవటానికి అడ్డదారులు వెతుక్కుంటున్నారు. తమ సమయాన్ని తమ అభివృద్ధి  కోసం కాకా చాటింగ్స్, డేటింగ్స్ అంటూ వృదాచేసుకుంటున్నారు. తమ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోటానికి,తమ అవసరాలు తీర్చుకోటానికి తలదించుకునే పనులు చేస్తున్నారు. యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందంటారు. మన దేశం ఉన్నతంగా ఎదగటానికి మన వంతు కృషిచేదం.
                 ప్రేమైన, అభిమానమైన, స్నేహమైన మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేల ఉండాలి. మనల్ని దిగజార్చేలా ఉండకూడదు. బ్రతికినంతకాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకునేకంటే....చనిపోయిన తర్వాత ఎం బ్రతికార్ర వీళ్ళు అని నలుగురు అనుకునేటట్టు బ్రతుకుదాం.

ప్రేమ కన్నా జీవితం గొప్పది! Article-13

ప్రేమ గొప్పదే! కాని ప్రేమ కన్నా జీవితం గొప్పది!
ప్రేమని ప్రదర్శించటానికి ముందు జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి
ఎప్పుడు ఒకరిగురించి ఆలోచించటం ప్రేమకాదు
మానసికంగా అలసిపోయినప్పుడు గుర్తు రావడం ప్రేమ
ఆ గుర్తురావటం లో హాయే ప్రేమ.

          మిన్ను విరిగి మీదపడుతున్నా
          చెదరని స్థైర్యం కావాలంటే
          నువ్వు చేసే పనిలో ఏ తప్పూ లేదని నమ్మకం కుదరాలి
          అప్పుడే జీవితం లో అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

Sunday, January 2, 2011

పాజిటివ్ థింకింగ్ Article-12

                   మనం అందుకోవడానికి, అనుభవించటానికి ప్రపంచంలో చాలా అవకాశాలు,అందాలు వున్నాయి. కానీ చాలామంది పదే పదే సమస్యల్ని,కష్టాలనీ తలచుకుంటూ డిప్రషన్ లో కూరుకుపోవటం వల్ల విలువైన జీవితాన్ని డల్ గా గడిపేస్తుంటారు.
                   నిరాశకు లోను కాకుండా యదార్దాలను యదాతధంగా గమనించడం ద్వార వాస్తవిక దృక్పధాన్ని పెంచుకోవాలి.
                 కస్టాలు ఎదురైనప్పుడు, వాటిలో మేలెంచి చూడటం- అంటే మనకు మంచే జరుగుతుంది అన్న పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం.
                 పాజిటివ్ థింకింగ్ తో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. మీ జీవితాన్ని సరైన పద్ధతిగా మలచుకోగలుగుతారు. దానికి ప్రతిగా జీవితం లో కష్టాలు తాత్కాలికమై, ఆనందాలు శాస్వతమౌతాయి.

కమ్యునిజం Article-11

కమ్యునిజం అంటే తుపాకీలతో యుద్ధం కాదు.
మనిషికి మనిషికి మధ్య మానవ సంభందాలు మెరుగు పడటం.
మానవతా విలువలను పెంపొందించటం.
మనుషుల మధ్య అసమానతలు తొలగటం - మనుషులంతా ఒక్కటిగా సంఘటితం అవటం.
మనుషుల మధ్య ద్వేషాలు తొలిగి - మనుషుల మధ్య సఖ్యత ఏర్పడటం.
మనిషిలో సహాయం చేసే గుణం పెంపొందడం.
మనుషుల మధ్య పేద ధనిక అనే వర్గాలు పోయి అందరు సమానమే అనే భావన తో మెలగడం.
కుల,మత,జాతి,ప్రాంత వైరాలు మరచి అందరు కలసి బ్రతకటం...
అందరు బాగుండే మంచి సమాజం.

మంచి మాట Article-10

'వ్యక్తిత్వం' కు మించిన అందం లేదు
'సాధనకు' కు మించిన అదృష్టం లేదు
'ప్రేమకు' కు మించిన తోడు లేదు
'ప్రతిభ' కు మించిన ధనం లేదు
'విజయం' కు మించిన ఆనందం లేదు
'ధైర్యం' కు మించిన శక్తి లేదు
'త్యాగం' కు మించిన గొప్పదనం లేదు

ఒక చిన్ని నవ్వే నవ్వి Article-9

ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్దాలెన్నో చేయొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బందాలెన్నో కలపొచ్చు
చిరునవ్వుల దీపం వెలిగించు - నీ బాధలకీ గతి తొలగించు
చిరునవ్వుల బాణం సంధించు - శత్రువులే గుండెను గమనించు
మనిషన్నాడే మనసారా తానే నవ్వోచు
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించు
పైనున్నోడే నీ నవ్వులు చూసి దిగి వచ్చు
నీతోపాటే తన కష్టం మారవచ్చు
.........................................
నీ గుండెల్లోనా గాయలేన్నున్నా- పెదవుల్లో నవ్వే వాటికీ మందు
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా - అదరాల నవ్వే వాటికి హద్దు
త్వరాగా.....నిను చూసి నవ్వే దారులు నివ్వెరపోయెట్టు.....
సరిగా.......నీ నవ్వుని నిచ్చన చేసి ఎక్కర పైమెట్టు........
నీ కోపం నువ్వే కరిగించు - నీ రూపం నువ్వే వెలిగించు
ఈ పాఠం నువ్వే పాటించు - పది మందికి నువ్వే చాటించు
..........................................
ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించి.....కసితీరా నవ్వేస్తుంది లోకం
నవ్వేవాళ్ళుంటే నవ్వులనదిలించి...కడుపార ఏడుస్తుంది కాలం
కనుకే........లోకాన్నే ఎదిరించేటి మార్గం కనిపెట్టు....
కదిలే.........కాలాన్నే ఎదురీదేటి ధైర్యం చూపెట్టు....
ఈ జీవిత సత్యం గుర్తించు - ఆనందం నువ్వై జీవించు
నీ చలనం నువ్వే గమనించు- సంచలనం నువ్వే సృష్టించు  
ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్దాలెన్నో ఆపోచు
ఒక చిన్ని నవ్వే నవ్వి బందాలెన్నో కలపోచు

దేశమంటే................. Article-8

దేశమంటే........ మతం కాదోయ్ గతం కాదోయ్
అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్
క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదుకాదోయ్
తీవ్రవ్యదిగా మారుతున్న తీవ్రవాదం కాదుకాదోయ్
దేశమంటే........ఏ.....ఏ.....ఏ..........
గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదుకాదోయ్
చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదుకాదోయ్
రాజధానుల రచభావనపు రచలీలలు కాదుకాదోయ్
అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకము కాదుకాదోయ్
పరిదిదటిన గాలి వార్తల ప్రసారాలు కాదుకాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్
ప్రాణ ధన మానాలు తీసే పగలసెగల పొగలు కాదోయ్
దేశమంటే........ఏ.....ఏ.....ఏ..........
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
ప్రేమించు ప్రేమపంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరునిగా ఆదరించు
హింస ఎందుకు సమస్యలను నవ్వుతు పరీష్కరించు
క్రోదమెందుకు కరుణ పంచు-స్వార్ధమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు-కక్షలేందుకు కౌగిలించు
మల్లెపువ్వులలాంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకుల రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు
కొత్తబంగరు భవిత నేడే కానుకందించూ 
దేశమంటే........ఏ.....ఏ.....ఏ..........
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్

మళ్లీ పుట్టనీ… నాలో మనిషిని Article-7

ఉప్పొంగిన సంద్రం ల ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ…
కొడిగట్టే దీపం ల మినుకు మినుకుమంటుంది
మనిషిగా బ్రతకాలనే  ఆశ…
గుండెల్లో ఊపిరై
కళ్ళల్లో  జీవమై
ప్రాణం లో ప్రాణమై.....ఐ…ఐ…ఐ…
మళ్లీ పుట్టనీ…నాలో మనిషిని…
మళ్లీ పుట్టనీ… నాలో మనిషిని…

వేదం Article-6

ఏ.. చీకటి చేరని కొత్తనీ.... బ్రతుకులో
ఓ..రేపని ఉందని తెలుసుకో…ఓ..
నీ…… ఒకనాటి  మిత్రుని  గుర్తుపడతవా….ఆ..ఆ..అ...
గుర్తుపడతావా...............................

కలల... నిజాల.... కనులు చెప్పే కథలు
మరల.. మనుషుల.. ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ..ఏ గాలిని ఊదాలనే…ఊహేవరిదో…
తెలుసుకోగలమా…ఆ.ఆ..అ.. తెలుసుకోగలమా..ఆ…ఆ...ఆ.........

ఏ చీకటి చేరని  కొత్తనీ...... బ్రతుకులో...ఓ.......

నీ ప్రేమ కోసం నేను Article-5

నిను తలచే మనసుని నేనే
నిను చూసే చూపుని నేనే
నీకై వెతికే కన్నులు నేనే
నిను తాకే చిరుగాలి నేనే
నిను వరించే వలపుని నేనే
నీకై తపించే గుండెను నేనే

               నాలో కలిగే ఆలోచన నువ్వే
                నాలో మెరిసే మెరుపువు నువ్వే
                నన్నే కదిపే తలపువు నువ్వే
                నాలో పొంగే సంతోషం నువ్వే

నా కంటికి వెలుగువు నువ్వే
నా ఆలోచనలకు ఆరంబం నువ్వే
నన్ను నడిపించే ధ్యేయం నువ్వే
నేను చేరే గమ్యం నువ్వే
                   
                   ఎక్కడున్నావ్,ఎలా వున్నావ్, ఏం చేస్తున్నావ్
                    నీ కోసం, నీ ప్రేమ కోసం పరితపిస్తూ
                                                                   - నీ నేను