మనిషికి వ్యక్తిత్వం ముఖ్యమైంది.ఒక వ్యక్తి యొక్క విలువను తెలిపేది వ్యక్తిత్వం. క్యారెక్టర్ అనేది మనిషి లోని క్వాలిటీ ని తెలియజేస్తుంది. మన దేశ దురాచారాలను మూఢనమ్మకాలను పక్కనపెడితే, మన సంస్కృతి సంప్రదాయాలు కటినంగా ఉన్నప్పటికీ మనుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాల కోసం,మనుషులకు మంచి వ్యక్తుత్వాల కోసం మన పూర్వికులు రూపొందించినవి. ఒకప్పుడు మనిషి గొప్పగా బ్రతకాలి అనుకునేవాడు. మన దేశ స్వతంత్రం కోసం నిస్వార్థంగా పోరాడిన ఎంతో మంది నాయకుల వ్యక్తిత్వాలు ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేసాయి. ఏదో సాదించాలానే తపనతో నిజాయితిగా బ్రతకడమే మంచి వ్యక్తిత్వానికి సరైన రూపం.
కానీ ఈరోజు నేటి యువత తమ వ్యక్తిత్వాలను సరైన పద్దతిలో కాకుండా వారి మనసుకుతోచినట్టు తమ స్వార్ధ బుద్దితో,వారి క్షనికావేసాల కోసం,తమ ఆనందాల కోసం తమని తామే పాడుచేసుకుంటున్నారు.తమ కోరికలు తీర్చుకోవటానికి అడ్డదారులు వెతుక్కుంటున్నారు. తమ సమయాన్ని తమ అభివృద్ధి కోసం కాకా చాటింగ్స్, డేటింగ్స్ అంటూ వృదాచేసుకుంటున్నారు. తమ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోటానికి,తమ అవసరాలు తీర్చుకోటానికి తలదించుకునే పనులు చేస్తున్నారు. యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందంటారు. మన దేశం ఉన్నతంగా ఎదగటానికి మన వంతు కృషిచేదం.
ప్రేమైన, అభిమానమైన, స్నేహమైన మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేల ఉండాలి. మనల్ని దిగజార్చేలా ఉండకూడదు. బ్రతికినంతకాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకునేకంటే....చనిపోయిన తర్వాత ఎం బ్రతికార్ర వీళ్ళు అని నలుగురు అనుకునేటట్టు బ్రతుకుదాం.
No comments:
Post a Comment