Thursday, January 13, 2011

మరణం Article-15

              ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరు మరణిస్తూ వుంటారు.మరణం ప్రతి మనిషి జీవితానికి ముగింపు. నా జీవితం లో కూడా ఏదో రోజు మరణం తప్పదు..ఈ మరణం ఎవరి జీవితంలోకి ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు.
              నేను చావు గురుంచి ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఒకరోజు ఆలోచించాల్సిన పరిస్తితి వచ్చింది. మా నైనమ్మ చనిపోయినప్పుడు- ఆమె కష్టాలన్నీ తీరాయని అనుకున్నాను కానీ ఆమె చనిపోయినందుకు బాధపడలేదు. కానీ మా అన్నయ్య చనిపోయినప్పుడు మొదటిసారి బాధపడ్డాను.ఇంకా జీవితాన్ని సరిగా అనుభవించని వయసు...ఇంతేనా జీవితం అనిపించింది. పుట్టాం బ్రతికం చనిపోవడం ఇదేనా జీవితం అనిపించింది. అందుకే చనిపోయేలోగా ఏదో సాదించాలనిపించింది.ప్రేమ ఆప్యాయత ఆస్తి అంతస్తులు డబ్బు తాత్కాలికం అనిపించింది. మనిషి పుట్టేటప్పుడు ఏమి లేకుండా పుడతాడు.కానీ చనిపోయేటప్పుడు తనకు మిగిలేది తన పేరు ఒక్కటే. ఆ పేరు చనిపోయాక కూడా చిరస్తాయిగా ఉండేలా బ్రతకాలని అనిపించింది. కేవలం ఆ పేరుకోసం కొనాళ్ళు బ్రతికిన చాలనిపించింది. చావు నాదగ్గరకి వచ్చేటప్పటికి నేను ఉన్నత స్థానంలో వుండాలి.....ఇదే నా లక్యం,నా గమ్యం.

No comments:

Post a Comment