Sunday, December 11, 2011

తలతిక్క మనిషి .......Article-32


                మనిషికి మనిషికి మధ్య సంబందాలు ఆరోగ్యకరంగా ఉండాలి...అలా ఉండాలి అంటే ముందు ఒకరినొకరు గౌరవించుకోవాలి...కనీసం ఒక్కరు అమర్యాదగా ప్రవర్తించిన ఆ ప్రభావం ఇద్దరి మీద ఉంటుంది. ఒకరిముందు ఒకరు చులకన అవుతారు..
      కొంతమంది మనుషులు ఎదుటివారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట.అనాలోచితంగా ఉంటుంది.ఎదుటివారిని దూషిస్తూ ఆనందపడతారు. ఎదుటి వ్యక్తుని కించపరిచే విదంగా, అవతలి వారి వ్యక్తుత్వాన్ని దిగజార్చే ప్రయత్నంలో ఉంటారు. కాని అలామాట్లాడటం వల్ల వీరి వ్యక్తుత్వం ఎంత దిగాజారుతుందో గ్రహించారు. ఎకిలిగా ప్రవర్తిస్తుంటారు. సబ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.పెద్ద చిన్న తేడాలు మరచి నోరు అదుపులో లేకుండా మాట్లాడతారు ఇలాంటి వారిని అదుపులో పెట్టాలంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి అంటే వాళ్ళను మళ్లి బడికి పంపి పెదబాలశిక్ష పుస్తకాలని చదివించాలి..అప్పుడన్నా సభ్యత సంస్కారం,ఎదుటివారి తో మర్యాదగా మాట్లాడటం వస్తాయేమో చూడాలి.
             అధికంగా ప్రగల్బాలు పలుకుతూ ఉంటారు. తమగురించి తామే గొప్పగా పోగుడుకుంటూ ఉంటారు. మాటలు చెప్పటమే గాని చేతల్లో ఉండదు. ఏ పని సక్రమంగా చేయరు. ఆలోచనలు కూడా సక్రమంగా ఉండవు. ఏ చిన్న సమస్య వచ్చిన చిరాకు,కోపం, మానసిక అశాంతి తో పళ్ళు కొరుక్కోవటం, తల గోడకేసి కొట్టుకోవటం లాంటి అనాగరిక చర్యలకు పాల్పడతారు. ఇలాంటి వారు మానసిక అశాంతితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు చూడటానికి బాగానే ఉంటారు కాని physicic disorder తో బాధపడుతూ ఉంటారు..ఇలాంటి వారిని రోజు యోగ చేయించటం అలాగే మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించటం మంచింది.

Monday, December 5, 2011

అభివృద్ధి.......Article-31


   అభివృద్ధి అంటే కేవలం పారిశ్రామిక అభివృద్దా..! రవాణా అభివృద్దా..! ఎగుమతులు దిగుమతుల అభివృద్దా...! సాంకేతిక పరంగా అభివృద్దా..! నగరాల్ని అందంగా ముస్తాబు చేయటంలో అభివృద్దా..!
నిజమే...అభివృద్ధి అంటే అదేకదా మరి..!
       అభివృద్ధి అంటే ప్రాజెక్ట్లు కట్టడం, ఫ్ల్య్ ఓవర్లు కట్టడం, పెద్ద పెద్ద భవంతులు నిర్మించటం కాదు....
అభివృద్ధి అనేది ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలి...అభివృద్ధి అనేది ముందు ప్రజల నుండి మొదలవ్వాలి. ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం, ఆహరం, నివాసం ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
ఈ ప్రజాస్వామ్య దేశం ఆ రకంగా అభివృద్ధి జరగడం జరగని పని.ఎందుకంటే నిస్వార్దంగా వ్యవహరించేవల్ల కన్నా పక్క వాళ్ళన్ని దోచుకుతినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు.
       దేశం అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి. దాని వల్ల administration ప్రజలకు దగ్గరవుతుంది. అనేది వాస్తవమే అయినప్పటికీ... చిన్న చిన్న రాష్ట్రాల వల్ల ప్రజా ప్రతినిదులమంటూ చెప్పుకునే రాజకీయ నాయకుల సంఖ్య  పెరుగుతుంది.దాని వల్ల ప్రజల సొమ్ము అధికంగా కోల్పోతాం.
      ఈ ప్రజాస్వామ్య దేశం లో చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతే ప్రజలకి ఉపయోగం ఉండదు..రాష్ట్ర అభివృద్ధి కూడా ఉండదు..అభివృద్ధి కావాలంటే రాష్ట్రాన్ని కొన్ని జోన్లు గా విభజించి ఆ జోన్ లను విశ్లేషించి విశిదీకరించి..ఆ ప్రకారంగా ప్రతి అంశం విద్య, వైద్యం,వ్యవసాయం, గృహాలు,త్రాగునీరు, సాగునీరు,రవాణా, రహదారులు మొదలైన అంశాలు అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
అభివృద్ధి నిజాయితితోనే సాద్యమౌతుంది..లేదంటే 60 సంవత్సరాలు కాదు ఇంకో 100 సంవత్సరాలు గడిచిన ఇలానే ఉంటుంది.నిస్వార్దమైన  అవినీతిరహిత సమాజంలోనే అభివృద్ధి సాధ్యమవుతుంది.