Saturday, April 30, 2011

నాగరికత.......Article-26

       మనిషి మూడనమ్మకాలను, దురాచారాలను త్యదించి ఒక నవీనమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు...........అదే నాగరికత....మనిషి తెలివి లేని మృగం దశ నుంచి తెలివి,సక్రమమైన ఆలోచనలు కలిగిన మనిషిగా రూపాంతరం చెందిన ఈ దశ నుంచి పుట్టిందే నాగరికత.
        నేటి కొన్ని పోకడులు చూస్తుంటే మళ్లీ ఈ సమాజం అనాగరికం లోకి నెట్టి వేయబడుతుందా అనిపిస్తుంది. మనిషి సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రపంచాన్ని చుట్టి ఎన్నో విజయాలు సాధించినా.... ఇంకా కొన్ని విషయాల్లో అనాగరికంగానే ప్రవర్తిస్తున్నాడు.
       ఉదాహరణకి క్రికెట్,టెన్నిస్ లాంటి ఆటలలో అడవిడుపు కోసం (cheer girls) అమ్మాయిలతో dance చేయించటం. ఆడవారంటే ఆట వస్తువుల, అందరిని entertain చేయటానికేన వాళ్ళు వుంది. వాళ్ళూ మనుషులేకదా.....వాళ్లకు ఆలోచన వుంది. మరి వాళ్ళని మనుషులుగా ఎందుకు ట్రీట్ చేయలేకపోతున్నాం. ఇదేనా నాగరికతంటే.. ఆడవాళ్ళు ఏ feelings లేని ఎంత్రాల.....వాళ్ళని ఆడిస్తూ మనం ఆనందిస్తున్నమా.......సాటి మనిషికి మనమిచే గౌరవం ఇదేనా...
       కొంతమంది ఆడవారు....వాళ్ళని వాళ్ళే దిగాజర్చుకునే దోరణిలో ప్రవర్తిస్తూ వుంటున్నారు. ఎలా అంటే క్రికెట్ లో ఫైనల్స్ లో గెలిస్తే దుస్తులు లేకుండా ఆ team ముందు నడుస్తా అని, లేదంటే olympic games లో స్వర్ణ పతకం గెలిస్తే గెలిచిన వాళ్ళతో dating చేస్తా అనో ఇలా జుగుప్చ కరమైన ప్రకటనలు చేస్తున్నారు...ఇంకొంతమంది పార్టీలకి,functions కి మినీ skirts, అరాకొర దుస్తులు వేసుకోస్తున్నారు.....అలాంటి దుస్తులు వేసుకోస్తున్న వాళ్ళకెలా ఉన్న చూసేవాళ్ళకి చాల జుగుప్స్తాకరంగా వుంటుంది. ఇదంతా high class societies లో తరచుగా జరుగుతుంది .మనిషి ఎక్కడైతే మొదలయ్యడో....మళ్లి అక్కడికే చేరుకుంటున్నాడు.
        మగవాళ్ళు ఆడవాళ్ళను హింసించటం,వేదించటం వంటివి ఈ నాగరిక సమాజంలో ఇంకా జరుగుతూనే వున్నాయి..ఒకరినొకరు మోసం చేసుకోవటం,ద్వేషించుకోవటం, దూషించుకోవటం, హత్యలు-దురాగతాలు, మత్తుమందు తీసుకోవటం,చెడు స్నేహాలు,లైంగిక వేదింపులు, అక్రమ సంబందాలు, అన్యాయాలు,అక్రమాలు, ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడి ఆనందపడే అల్పసంతోషాలు,అహంకారాలు, మతోన్మాదాలు, తీవ్రవాదాలు...ఒక్కటేంటి చెప్పుకుంటుపోతే ఇంకా ఎన్నో లోపాలు.ఇది మనిషి జీవితం.....ఇది మనం నాగరికత అనుకునే అనాగరిక సమాజం..
      

Thursday, April 21, 2011

టెక్నాలజీ.......Article-25

దుర్వినియోగం అవుతున్న సాంకేతిక పరిజ్ఞానం.........సెల్ ఫోన్లు ,ఇంటర్నెట్ లు వంటి టెక్నాలజీ లు అభివృద్ధి చెందుతున్న కోద్దీ.....యువత చేతిలో అవి దుర్వినియోగముతున్నాయి. టెక్నాలజీ తో ముందడుగు వేయాల్సిన యువత అదే టెక్నాలజీ తో వ్యసనాలకు లోనవుతున్నారు. ఉదాహరణకి సెల్ ఫోన్ చాటింగ్ లేక ఇంటర్నెట్ చాటింగ్ - ఇవి వుంటే చాలు నిద్రాహారాలు మాని వాటికే అతుక్కుపోతుంటారు.....ఈ దుర్వినియోగం మనిషిని ఒక మానసిక వికలాంగుడి ల చేస్తుంది...డ్రగ్ అడిక్ట్ గా తయారవుతారు.....సమయానికి అవి లేకపోతే పిచ్చేక్కినట్టుగా ప్రవర్తిస్తుంటారు....గంటలు గంటలు సెల్ ఫోన్లలో మాట్లాడటం వాళ్ళ మెదడు దెబ్బతింటుంది.మెదడు కంట్రోల్ తప్పుతుంది..అలాగే ఇంటర్నెట్ లో గంటలకొద్దీ అనోవసరమైన చాటింగ్ ల వల్ల ఒక లాంటి సైసిక్ డిస్-ఆర్డర్ వస్తుంది..మనిషి యొక్క మెంటల్ అబిలిటీ తగ్గుతుంది.దానితో పిచ్చి వాడి ల ప్రవర్తిస్తాడు....it is a slow poison.అలాగే సెల్ ఫోన్లలో చెడు సాహిత్యాన్ని నిక్షిప్తం చేసుకోవటం.....ఇంటర్నెట్ లలో చెడును ప్రేరేపించే website లను అదేపనిగా చూడడం వంటివి చేస్తుంటారు.అలాంటి వాటి దుష్ప్రభావం వల్ల  ఒకొక్కసారి ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉంటారు.. అవి మనిషి వ్యక్తుత్వాన్ని దిగజారుస్తాయి.....టెక్నాలజీ ని దయచేసి దుర్వినియోగం చేయకుండా  ఉపోయోగించుకుందాం.

ఈ క్రింది websites టెక్నాలజీ దుర్వినియోగం యొక్క పరిణామాలను తెలియజేస్తుంది.
http://en.wikipedia.org/wiki/Mobile_phone_radiation_and_health
http://jbenjamin.org/research99/report.html

Wednesday, April 20, 2011

స్వేచ్చ.......Article-24

స్వేచ్చ- సువిశాల ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది స్వేచ్చ. ప్రతి మనిషి మనిషి ఆజ్ఞానుసారం బ్రతకకుండా,తమకు నచ్చిన విదంగా బ్రతకలనుకుంటారు.....వేరొకరికి ఇబ్బంది కలిగించకుండా స్వేచ్చగా బ్రతకితే బాగానేవుంటుంది.....కానీ మనిషి సాంఘిక జీవి........పక్కన ఎవరు తోడు లేకుండా ఒక్కడే బ్రతకలేడు.
              ఇంకా యువత విషయానికి వస్తే స్వేచ్చ అనే మాటకి సరైన అర్ధం తెలీదు. స్వేచ్చకి విచ్చలవిడి తనానికి తేడా తెలీదు. ..వారికీ నచ్చినట్టు ప్రవర్తించటమే స్వేచ్చ అనుకుంటారు...వారి ఆలోచనలు చంచలంగా వుంటాయి. కౌమారు దశలోనే మనిషికి పరిపక్వత కలిగిన ఆలోచనలు రావు. దస లో ఆడపిల్లలు కానీ-మగపిల్లలు కానీ వాళ్ళు అనుకున్నదే జరగాలి అనే ఆలోచనలో వుంటారు...మంచి-చెడు గురుంచి ఆలోచన వుండదు. ఆకర్షణను చూసి ప్రేమనుకుంటారు. కొంతకాలం కలిసి తిరుగుతారు...తర్వాత మనస్పర్దల వల్లో లేక ఒకరికొకరు నచ్చకో విడిపోతారు.....మళ్ళి వేరొకరితో కొత్త స్నేహాలు ప్రారంభిస్తారు. యువ దశలో సినిమాల వల్లకాని...చుట్టూ ప్రక్కల పరిసరాల వాళ్ళ కానీ.....సమాజ పోకడల వాళ్ళ కానీ యువత ఎంతో కొంత ప్రభావితమవుతారు. సమాజం లో జరిగే తప్పుల్ని ఒప్పులుగా భావిస్తారు. వాళ్ళెవరో చెడు చేసారు......మనం చేస్తే తప్పేంటి అనే ఆలోచనలు వస్తుంటాయి. మంచేదో చెడేదో కూడా తెలుసుకోలేని ఆలోచనలతో వుంటారుఎవరు ఏమి చెప్పిన వినరు.....స్వేచ్చగా బ్రతకాలని కోరుకుంటారు....అడ్డదారులు తొక్కుతారు...దీనికి తోడు technology తోడైంది......సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నకొద్దీ యువతలో కొత్త పోకడలు ప్రారంబమవుతున్నాయి. టెక్నాలజీ ని మంచి కన్నా చెడుకే ఉపయోగిస్తున్నారు..సెల్ ఫోన్ లో ,ఇంటర్నెట్ లో చాటింగ్ లతో, ఇంకా రకరకాల వ్యసనాలతో  స్వేచ్చగా బ్రతకాలనుకుంటారు. స్వేచ్చకి విచ్చలవిడి తనానికి తేడా తెలుసుకోలేని పరిస్తితిలో వుంటున్నారు.
              యువత విధంగా తయారవటానికి కారణం ఎవరు...?
యువత తల్లితండ్రులు వారి ప్రవర్తనకు నైతిక బాధ్యత వహించాలి. తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తువుండాలి. మంచి చెడుల విచక్షణ గురుంచి తెలియజెప్పాలి. యువ దశలో వుండే ఆకర్షణల గురుంచి తెలీయజెప్పాలి. సమాజం పట్ల అవగాహన కలిగించాలి. తల్లితండ్రులంటే తమ పిల్లలు సుకంగా వుండాలి అని సంపాదించటమే కాదు.....వారి వ్యక్తుత్వాలను తీర్చి దిద్దే ఉపాద్యాయులు కూడా కావాలి. డబ్బు వల్ల యువత లో అహంకారం,ద్వేషం,కోపం,అర్దంలేని సరదాలు లాంటి దుర్గునాలు రావొచ్చు...పిల్లలకి డబ్బు విలువ,మంచితనం విలువ తెలీయజేయాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. అప్పుడే వాళ్లకు స్వేచ్చకు విచ్చలవిడి తనానికి మద్య బేదం తెలుస్తుంది. స్వేచ్చ దేశ అభ్యున్నతికి,దేశ ప్రగతికి ఉపయోగపడేలా వుండాలి..అప్పుడే దేశం స్వచ్చంగా స్వేచ్చగా వుంటుంది.....దేశం ప్రగతి పదంలో పయనిస్తుంది.

Thursday, April 7, 2011

దేవుడు.............Article-23

దేవుడు........అసలు దేవుడేవారు...? ఎక్కడనుంచి పుట్టాడు....? ఎవరికోసం పుట్టాడు...? ఎం చేయటానికి పుట్టాడు...? దేవుడు వున్నాడా లేడా...? వుంటే ఏమి చేస్తున్నాడు....? ఇంకా అడగాలంటే చాలా ప్రస్నాలున్నై.
దేవుడు మనిషి భయం లోంచి పుట్టాడు....మనిషి తను చేయలేని పనిని చేయటానికి ప్రయత్నిచేటప్పుడు....తనపై తనకి నమ్మకం తగ్గినప్పుడు....అంటే తన ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు....తన మనసు బలహీనంగా వున్నపుడు.....అతనికి ఒక ధైర్యం కావాలి.... ధైర్యం అద్భుతాలు సృష్టించాలి అనుకుంటాడు.... ధైర్యం పేరే దేవుడు.... నిజంగానే ధైర్యం అద్భుతాలు సృస్తిస్తుందా....అంటే అది యాదృచ్చికం (its a probability)....అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దేవుడు గొప్పవాడంటాడు...లేదంటే దేవుడికి నేనంటే దయ లేదని సర్దుకుపోతారు కొందరు...మరి కొందరు దేవుడ్ని తిట్టుకుంటారు.....తప్పు మనం చేసిన పక్కోడ్ని తిట్టడం మనిషి లక్షణం కాబ్బట్టి....ఎవడ్ని తిడితే ఎవడేమంటడో....మరి కోపం తగ్గేదెల.....అందుకే దేవుడు అనే concept పెట్టి వాడ్ని తిడతాం....
ఇంకా మనిషి లో దేవుడు విషయానికి వస్తే....మంచి చేసేవాడు దేవుడు.....చెడు చేసే వాడు రాక్షసుడు.....
దేవుడు వున్నాడు అని నమ్మితే దేవుడంటే అందరికి మంచి చేయాలి....అందరిని సరైన మార్గం లో నడిపివ్వాలి....కుట్రలు- కుళ్ళు,మాసాలు-ద్వేషాలు లేని మంచి సమాజాన్ని నిర్మంచాలి.....అంటే చెడు లేని సమాజాన్ని నిర్మించాలి....
ఇవేవి లేకపోతే మనిషికి లైఫ్ వేల్యూ తెలీదు అంటే.....మరి ఎంత మందికి లైఫ్ వేల్యూ తెలుస్తుంది.......ఎంతమంది మనుషులుగా మరి చనిపోతున్నారు...
కర్మ అంటారు.....పోయిన జన్మ లో తప్పు చేస్తే జన్మ లో తప్పుకి ఫలితం అనుభావిస్తారంటారు...... జన్మ లో చేసిన తప్పులే మనిషికి సరిగా గుర్తుండవు....పోయిన జన్మలోవి ఇంకేం గుర్తున్టై.......తప్పు చేసినప్పుడే శిక్షపడితే....తర్వాత తప్పు చేయటానికి బయపడతారు...తప్పు చేసి ... చేసిన తప్పుని మర్చిపోయి....అప్పుడు శిక్ష వేస్తాం అంటే....ఇది ఎలా వుందంటే దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్క మొరిగింది అంటారే అల వుంది....
            ఫ్రాంక్ గా చెప్పాలంటే......దేవుడు అనేది ఒక పదం మాత్రమే.....దేవుడు అనే అతీత శక్తి ఏది లేదు........
కొంతమంది....comedy కి అంటారో...ఎందుకంటారో తెలీదు....దేవుడ్ని నమ్మరంట.....కాని దెయ్యం మంటే బయమంట....నా దృష్టిలో దేవుడు...దెయ్యం అనే రెండు అతీత శక్తులు లేవు.....
ప్రపంచాన్ని సాసించేవి రెండే రెండు......అవి.....మంచి.....చెడు.......
మంచి మనిషిని దేవుదంటారు......
చెడ్డవాళ్ళను దేయ్యమంటారు.....that's all...nothing else......