స్వేచ్చ- ఈ సువిశాల ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది స్వేచ్చ. ప్రతి మనిషి ఎ మనిషి ఆజ్ఞానుసారం బ్రతకకుండా,తమకు నచ్చిన విదంగా బ్రతకలనుకుంటారు.....వేరొకరికి ఇబ్బంది కలిగించకుండా స్వేచ్చగా బ్రతకితే బాగానేవుంటుంది.....కానీ మనిషి సాంఘిక జీవి........పక్కన ఎవరు తోడు లేకుండా ఒక్కడే బ్రతకలేడు.
ఇంకా యువత విషయానికి వస్తే స్వేచ్చ అనే మాటకి సరైన అర్ధం తెలీదు. స్వేచ్చకి విచ్చలవిడి తనానికి తేడా తెలీదు. ..వారికీ నచ్చినట్టు ప్రవర్తించటమే స్వేచ్చ అనుకుంటారు...వారి ఆలోచనలు చంచలంగా వుంటాయి. కౌమారు దశలోనే మనిషికి పరిపక్వత కలిగిన ఆలోచనలు రావు. ఈ దస లో ఆడపిల్లలు కానీ-మగపిల్లలు కానీ వాళ్ళు అనుకున్నదే జరగాలి అనే ఆలోచనలో వుంటారు...మంచి-చెడు ల గురుంచి ఆలోచన వుండదు. ఆకర్షణను చూసి ప్రేమనుకుంటారు. కొంతకాలం కలిసి తిరుగుతారు...తర్వాత మనస్పర్దల వల్లో లేక ఒకరికొకరు నచ్చకో విడిపోతారు.....మళ్ళి వేరొకరితో కొత్త స్నేహాలు ప్రారంభిస్తారు. యువ దశలో సినిమాల వల్లకాని...చుట్టూ ప్రక్కల పరిసరాల వాళ్ళ కానీ.....సమాజ పోకడల వాళ్ళ కానీ యువత ఎంతో కొంత ప్రభావితమవుతారు. సమాజం లో జరిగే తప్పుల్ని ఒప్పులుగా భావిస్తారు. వాళ్ళెవరో చెడు చేసారు......మనం చేస్తే తప్పేంటి అనే ఆలోచనలు వస్తుంటాయి. మంచేదో చెడేదో కూడా తెలుసుకోలేని ఆలోచనలతో వుంటారు. ఎవరు ఏమి చెప్పిన వినరు.....స్వేచ్చగా బ్రతకాలని కోరుకుంటారు....అడ్డదారులు తొక్కుతారు...దీనికి తోడు technology తోడైంది......సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నకొద్దీ యువతలో కొత్త పోకడలు ప్రారంబమవుతున్నాయి. టెక్నాలజీ ని మంచి కన్నా చెడుకే ఉపయోగిస్తున్నారు..సెల్ ఫోన్ లో ,ఇంటర్నెట్ ల లో చాటింగ్ లతో, ఇంకా రకరకాల వ్యసనాలతో స్వేచ్చగా బ్రతకాలనుకుంటారు. స్వేచ్చకి విచ్చలవిడి తనానికి తేడా తెలుసుకోలేని పరిస్తితిలో వుంటున్నారు.
యువత ఈ విధంగా తయారవటానికి కారణం ఎవరు...?
యువత తల్లితండ్రులు వారి ప్రవర్తనకు నైతిక బాధ్యత వహించాలి. తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తువుండాలి. మంచి చెడుల విచక్షణ గురుంచి తెలియజెప్పాలి. యువ దశలో వుండే ఆకర్షణల గురుంచి తెలీయజెప్పాలి. సమాజం పట్ల అవగాహన కలిగించాలి. తల్లితండ్రులంటే తమ పిల్లలు సుకంగా వుండాలి అని సంపాదించటమే కాదు.....వారి వ్యక్తుత్వాలను తీర్చి దిద్దే ఉపాద్యాయులు కూడా కావాలి. డబ్బు వల్ల యువత లో అహంకారం,ద్వేషం,కోపం,అర్దంలేని సరదాలు లాంటి దుర్గునాలు రావొచ్చు...పిల్లలకి డబ్బు విలువ,మంచితనం విలువ తెలీయజేయాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. అప్పుడే వాళ్లకు స్వేచ్చకు విచ్చలవిడి తనానికి మద్య బేదం తెలుస్తుంది. స్వేచ్చ దేశ అభ్యున్నతికి,దేశ ప్రగతికి ఉపయోగపడేలా వుండాలి..అప్పుడే దేశం స్వచ్చంగా స్వేచ్చగా వుంటుంది.....దేశం ప్రగతి పదంలో పయనిస్తుంది.
No comments:
Post a Comment