Sunday, January 2, 2011

ఒక చిన్ని నవ్వే నవ్వి Article-9

ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్దాలెన్నో చేయొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బందాలెన్నో కలపొచ్చు
చిరునవ్వుల దీపం వెలిగించు - నీ బాధలకీ గతి తొలగించు
చిరునవ్వుల బాణం సంధించు - శత్రువులే గుండెను గమనించు
మనిషన్నాడే మనసారా తానే నవ్వోచు
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించు
పైనున్నోడే నీ నవ్వులు చూసి దిగి వచ్చు
నీతోపాటే తన కష్టం మారవచ్చు
.........................................
నీ గుండెల్లోనా గాయలేన్నున్నా- పెదవుల్లో నవ్వే వాటికీ మందు
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా - అదరాల నవ్వే వాటికి హద్దు
త్వరాగా.....నిను చూసి నవ్వే దారులు నివ్వెరపోయెట్టు.....
సరిగా.......నీ నవ్వుని నిచ్చన చేసి ఎక్కర పైమెట్టు........
నీ కోపం నువ్వే కరిగించు - నీ రూపం నువ్వే వెలిగించు
ఈ పాఠం నువ్వే పాటించు - పది మందికి నువ్వే చాటించు
..........................................
ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించి.....కసితీరా నవ్వేస్తుంది లోకం
నవ్వేవాళ్ళుంటే నవ్వులనదిలించి...కడుపార ఏడుస్తుంది కాలం
కనుకే........లోకాన్నే ఎదిరించేటి మార్గం కనిపెట్టు....
కదిలే.........కాలాన్నే ఎదురీదేటి ధైర్యం చూపెట్టు....
ఈ జీవిత సత్యం గుర్తించు - ఆనందం నువ్వై జీవించు
నీ చలనం నువ్వే గమనించు- సంచలనం నువ్వే సృష్టించు  
ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్దాలెన్నో ఆపోచు
ఒక చిన్ని నవ్వే నవ్వి బందాలెన్నో కలపోచు

No comments:

Post a Comment