పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కాని పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే .
ఇది డబ్బు ఉన్నవాడు చెప్పే మాట. డబ్బుకు ప్రముఖ్యతిచ్చేవాడు చెప్పేమాట. డబ్బు కేవలం పేదవాడ్ని ధనికుడిగా చేస్తుంది తప్ప, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడ్ని చేయలేదు. డబ్బు కేవలం ఒకరి అవసరాలు తీర్చుకోవటానికి మాత్రేమే ఉపయోగపడుతుంది కానీ గొప్ప వ్యక్తిత్వం పది మంది మేలు కోసం ఉపయోగ పడుతుంది. ప్రతి ధనికుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు, అలానే ప్రతి పేదవాడు చరిత్రహీనుడు కాదు.
డబ్బు ఈ రోజు నిన్ను సుఖపెడుతుంది రేపు నిన్ను బాధపెడుతుంది, ఈ రోజు నీతో ఉంటుంది రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు, కాని గొప్ప వ్యక్తిత్వం జీవితాంతం నీ తోనే ఉంటుంది, నిన్ను నలుగురి ముందు గొప్పగా నిలబెడుతుంది నీ మరణం తర్వాత కూడా జీవిస్తుంది. డబ్బు వల్ల నీకు దగ్గరయ్యేవాళ్ళ వల్ల నీకు మేలుకంటే కీడే ఎక్కువ జరగవచ్చు, కానీ మన వ్యక్తిత్వం వల్ల దగ్గరయ్యే వాళ్ళు మన చివరి శ్వాసవరకు మనతోనే ఉంటారు.
తన గురించే ఆలోచించమనేది డబ్బు...అందరి కోసం ఆలోచించమనేది గొప్ప వ్యక్తిత్వం. స్వార్ధం తో కూడుకునేది డబ్బు-సహాయం చేసే గుణం తో కుడుకునేది గొప్ప వ్యక్తిత్వం. డబ్బు 'నా' తో మొదలవుతుంది -గొప్ప వ్యక్తిత్వం 'మన' తో మొదలవుతుంది.
నువ్వు పుట్టినప్పుడు నీకేమి లేవు పోయేటప్పుడు ఏమి తీసుకుపోవు.నీకంటూ మిగిలేది నీ పేరు మాత్రమే. ఆ పేరు కేవలం అక్షరాల్లా మిగిలిపోకూడదు- ఒక చరిత్రగా మారాలి అంటే అది కేవలం ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లే సాధ్యం -డబ్బు వల్ల కాదు.
నువ్వు పుట్టినప్పుడు నీకేమి లేవు పోయేటప్పుడు ఏమి తీసుకుపోవు.నీకంటూ మిగిలేది నీ పేరు మాత్రమే. ఆ పేరు కేవలం అక్షరాల్లా మిగిలిపోకూడదు- ఒక చరిత్రగా మారాలి అంటే అది కేవలం ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లే సాధ్యం -డబ్బు వల్ల కాదు.
No comments:
Post a Comment