కులం- వృత్తి కి ఇంకొక పేరు కులం..ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన వృత్తి ని ఎంచుకోవటం వల్ల, ఆ నిర్దిష్టమైన వృత్తి కి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరే కులం. ఈ కులం సంవత్సరాలు గడిచేకొద్దీ చెట్టు ధృడంగా ఉండాలంటే వ్రేళ్ళు ఏ విధంగా అయితే భూమి లోపాలకి చొచ్చుకుని పోతాయో, అదే విధంగా ఈ కులం అనే ఒక పదం మనుషుల నరనరాల్లోకి జీర్నీంచుకుపోయి మనిషి మెదడును తొలిచే క్రిమి లా తయారైంది. తొండ ముదురితే ఊసరవెల్లి అవుతుంది అన్నట్టు...కులం అనే ఒక పదం అనేక సామజిక వర్గాలుగా విభజించబడింది. ఇంతటితో ఆగకుండా అగ్రకులాలు నిమ్న కులలుగా విభజించబడి కుల వివక్షకు దారి తీసింది..
స్వాతంత్రం వచ్చి 65 సం|| గడుస్తున్న నేటికి చంద్రశేఖర్ ఆజాద్ ని చూపిస్తే మన కులమేనా అని అడిగే చదువుకున్న కుల గజ్జి వ్యాధిగ్రస్తులు ఇంకా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రభోజుడుగా ప్రఖ్యాతిగాంచిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ క్రిష్ణదేవరాయులు మా కులం అంటే మా కులం అంటూ సాక్షాదారాలతో వాదనలు చేసుకునే సంఘటనలు నేటికి ఇంకా జరుగుతున్నాయి అంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. కచ్చితంగా నేటికి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.
ఒక వ్యక్తి తన గొప్ప వ్యక్తిత్వం వల్లో సక్రమమైన ఆలోచనల వల్లో, తన అకుంటిత కార్యాచరణ వల్లో కీర్తిని సముపార్జిస్తాడు.ఆ కీర్తి తన స్వార్జితం.అయితే అదే వ్యక్తి యొక్క సామజిక వర్గానికి చెందిన మిగిలిన వారు అతని వ్యక్తుత్వాన్ని అతని ఆలోచనలను, అతని కార్యాచరణను ఆదర్శంగా తీసుకుని అతనిలా ఎదగడం పై ద్రుష్టి పెట్టకుండా...అతను మా సామజిక వర్గం వాడే అని అంటే మా కులం వాడే అని పొగుడుతూ కాలం గడిపేస్తారు గాని వాళ్ళ వ్యక్తుత్వాల్ని, నడవడిని ఆదర్శంగా తీసుకుని మారడానికి ప్రయత్నించారు.
సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అయ్యారు.సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే సర్దార్ భగత్ సింగ్ భారతమాత గుండెల్లో నిలిచిపోయి అమరుడయ్యారు. సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే చంద్రశేఖర్ ఆజాద్ మన భారత ఖండంలో చిరస్తాయిగా నిలిచిపోయారు. సామజిక వర్గం(కులం) గురించి ఆలోచించలేదు కాబట్టే పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్యగా జనం గుండెల్లో నిలిచిపోయారు .
కులాన్ని గౌరవించటం మానేసి మనుషుల వ్యక్తుత్వాన్ని గౌరవించటం మొదలుపెట్టిన రోజున ఈ దేశం పురోగమిస్తుంది.
No comments:
Post a Comment