Wednesday, October 8, 2014

ఇదేనా..! ప్రజాస్వామ్యం ....... Article - 43

ప్రజాస్వామ్య దేశం ...

డబ్బులు పారేసి సీట్ కొనుక్కుని యమ్.పి. నో , ఎమ్.ఎల్.ఎ. నో అయ్యి కొన్నివేల కోట్లు మింగేస్తారు...ఇది​
మన ప్రజాస్వామ్యం ...

వెయ్యమంది పొట్టగొట్టి పదిమందికి ఉపాది కల్పించి, అసలు పెట్టుబడిదారులు లేకపోతే ఉపాది ఎవరు కల్పిస్తారు అని ప్రశ్నించే వారున్న ఈ దేశం ... ప్రజాస్వామ్య దేశం ...

మన రూపాయి విలువ పెరగకపోయినా పెట్టుబడిదారులు లేకపోతే అభివృద్ధి లేదు అని ఆరాటపడే వాళ్ళున్న ఈ దేశం ప్రజాస్వామ్య దేశం..

మా దేశం లో పెట్టుబడులు పెట్టండి మా దేశ ప్రజల పొట్టగొట్టి మీకు లాభాలు ఇస్తాం, లాభాల్లో కమీషన్లు మాకివ్వండి , దానికి అభివృద్ధి అని పేరు పెట్టి మా ప్రజలను మభ్య పెడతాం ...ఇది మన ప్రజాస్వామ్యం...

ప్రభుత్వ సంస్థలు దివాలా తీయిస్తారు - ప్రైవేటు సంస్థలకు రాయతీలిస్తారు ..ఇది మన ప్రజాస్వామ్యం ...
చిరు వ్యాపారులకు చేయుతనివ్వక దయనీయ పరిస్థితి - బడా వ్యాపారులకు బాగా చెయ్యందించి పైకి లాగుతారు ..ఇది మన ప్రజాస్వామ్యం ..

దేశ అభ్యునతి కోసం స్వదేశి వస్తువులనే వాడాలని హితబోదలు చేస్తారు కాని అధిక సేతం విదేశి వస్తువులనే విక్రయిస్తారు .. ఇది మన ప్రజాస్వామ్యం.​

ఇంటికో ఉద్యోగం పేరుతో రైతుల పొలాలను తక్కువ ధరకు కొనుక్కుని , కనీసం 10% కూడా ఉద్యోగాలివ్వని వైనం ...ఇది ​​మన ప్రజాస్వామ్యం ...​

సెజ్ లు పెడతాం - నిరుద్యోగం నిర్మూలిస్తాం, ఇంటికో ఉద్యోగం అని ఆశ చూపి రైతుల భూములు తక్కువ ధరకు కొనుక్కుని , ఇంటికో ఉద్యోగం కాదుకదా , పైగా ఆ సెజ్ల వల్ల ఊరు కనుమరుగైన వైనం ...ఇది మన ప్రజాస్వామ్యం.


No comments:

Post a Comment