Tuesday, October 28, 2014

సిరిగల్ల భారతదేశం .. తాకట్టు పెట్టబడ్డది ....... Article - 44

సిరిగల్ల భారతదేశం .. తాకట్టు పెట్టబడ్డది

పేరుకేమో  పోటి  ప్రపంచం .. నడిచేది దొంగల  రాజ్యం
నోటికాడ  కూడా  లాగి... డబ్బున్నోడికి  తినబెడతారు

స్వత్చ భరత్ నినాదాలు .. చిపురుతో ఫోటోలకు ఫొసులు
పురపాలక  కార్మికులకి .. రెక్కాడితే డొక్కాడదు , జీతాలు సమయానికి ఇవ్వరు

నల్ల  ధనము బయటకి  లగుతామని వాగ్దానాలు .. పేర్లు  బయట  పెట్టోదని అసోచం (పారిశ్రామికవేత్తల సమాఖ్య)
దాగుడుమూతలు  ఆడుతున్నార .. దేశ భవిష్యత్ బాగుపడున

అభివృద్ధి  మా  లక్ష్యమని  ..ప్రగల్బాలు పలికినారు
పెట్టుబడిదారులకు  అభివృద్ధి .. సామాన్య ప్రజల  నెత్తిన  ధరల  మోతలు

మతతత్వపు  రాజకీయాలు , ప్రాంతీయ  వైషమ్యాలు
ప్రజల  ఆలోచన  మరల్చటానికి .. పదవులు  నిలుపుకొనుటకు

విదేశి  ప్రత్యక్ష  పెట్టుబడులంటూ  పరదేశాలని  ఆహ్వానించిరి
మన  సంపాదన  మన  దేశ అభ్యున్నతికి  కాకా  .. పరదేశం పాలు కాకతప్పదు

చాపకింద  నీరు  లాగా  .. తెర వెనక  భాగవతం  జరుగుతూ  ఉంది
ఇప్పటికైనా  కళ్ళు  తెరవర .. లేకుంటే  బానిస  బ్రతుకే.

No comments:

Post a Comment