Saturday, May 7, 2011

తెలంగాణ.......Article-27

      తెలంగాణ సాయుధ పోరాట వీరులు ఎంతో మంది నిజాం నిరంకుసత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసినారు ఆనాడు... తెలంగాణ---మన తెలుగు రాష్ట్రము లో అభివృద్ధి లో వెనుకబడిన ప్రాంతం.....వేనుకబాడటానికి కారణాలేంటి....? విద్య, వైద్యం,ఉపాది...ఇవి తెలంగాణ లో లేవ...? మరి రాయలసీమ లోను ఇదే సమస్య. 
       ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తెలంగాణా కలిసి 55 సంవత్సరాలు అయింది....మరి ఇంకా తెలంగాణ అభివృద్ది సాధించలేదు. తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించిన నాటి నుంచి కూడా 'ప్రత్యేక తెలంగాణ' అంటూ నినదిస్తూనే ఉన్నారు. తెలంగాణ నినాదం ఈ ప్రాంతపు ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయేలా చేసారు.
       తెలంగాణ అభివృద్దికి ఆంధ్ర నాయకులే అడ్డుగా నిలబడ్డారని వారి వాదన....సరే ఆంధ్ర నాయకులే తెలంగాణ అభివృద్దికి అడ్డుపడ్డారు అనుకుందాం. మరి తెలంగాణ నాయకులూ తెలంగాణ అభివృద్ధికి ఏమి చేసినట్టు.....ఏ ప్రాంత నాయకులు ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి...మరి తెలంగాణ నాయకులికి వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనే లేదా....ఆ ప్రాంత బాగోగులు చూసుకొనే బాద్యతలేదా. ఎందుకుంటుంది తెలంగాణ నాయకుల ఎజండా పదవుల కోసం 'ప్రత్యేక తెలంగాణ', అంతే కాని ఆ ప్రాంత ప్రజలకు మేలు చేద్దాం అనే ఆలోచనే లేదు. తెలంగాణ ప్రజలలో ప్రత్యేక తెలంగాణ రాకపోతే వారికి భవిష్యత్తు లేదు అనే అబధ్రతా భావాన్ని కల్పించింది మాత్రం తెలంగాణ నాయకులే.....
      ప్రజల దృష్టి మరల్చటానికి ఆంధ్ర నాయకులను స్వార్ధపరులుగా పేర్కొంటున్నారు, ప్రాంత వివాదాలు సృష్టిస్తున్నారు తెలంగాణ నాయకులు.
  ప్రాంతాల కోసం పోరాటం ఆ ప్రాంత అభివృద్దికి తోడ్పడదు.....ఆ ప్రాంత రాజకీయ నాయకుల పదవుల కోసం తోడ్పడుతుంది.

మతోన్మాదం,ఉగ్రవాదం,తీవ్రవాదం, ప్రాంతోన్మాదం,కులోన్మాదం-ఇవన్ని అర్ధం లేని ఆలోచనలు..వీటికోసం చేసే త్యాగాలు,పోరాటాలు అర్ధం లేనివి.
ప్రాంతాల కోసం పోరాటాలు వద్దు.....హక్కుల కోసం పోరాటాలు చేద్దాం.
     ఆంధ్రా పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టి జనాన్ని దోచుకుంటున్నారు అంటున్నారు....పెట్టుబడిదారుడు ఏ ప్రాంతానికైనా పెట్టుబడిదరుడే.....తమ పెట్టుబడుల తో జన్నాన్ని దోచుకోవటం వారి నైజం. పెట్టుబడిదారుడికి ప్రాంతబేదాలు ఉండవు...తన మన అనే తరతమ్య బేదాలు ఉండవు. పెట్టుబడిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలను దోచుకుంటాడు.
       స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య దేశంలో మన దేశ భవిష్యత్తు ఏ విధంగా రాజకీయనాయకుల చేతుల్లోకి వెళ్లిందో అదే విధంగా ఈ ప్రజా ఉద్యమం ప్రత్యేక రాష్ట్రము ఏర్పడ్డాక రాజకీయనాయకుల చేతుల్లోకి వెళ్తుంది. దాని వల్ల ఉద్యమ ఫలితం ప్రయోజనం లేకుండా పోతుంది.ఈ ప్రజాస్వామ్య దేశం లో రాష్ట్రాలుగా విడిపోతే-దాని వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు....ప్రజాస్వామ్య రాజకీయ నాయకులకు మేలు జారుగుతుంది అంతే. ఈ విషయాన్ని అని ప్రాంతాల ప్రజలు గ్రహించాలి. 
      మనమేమైన సమసమాజ స్థాపన కోసం పోరాటాలు చేస్తున్నామా....బలిదానాలు త్యాగాలు చేయటానికి...
మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంత ప్రజలకి విద్య వైద్యం సక్రమంగా అందడం కోసం, మన ప్రాంత ప్రజల ఉపాది కల్పన కోసం ఉద్యమాలు చేద్దాం-మన భావితరాల జీవితాల్ని అభివృద్ధి పదం లో నడిపిద్దాం.రాయలసీమ,కోస్త, తెలంగాణా....ఏ ప్రాంతంలో అయిన తెలుగు మాట్లాడేవల్లని ఆంధ్రులు అంటారు...ఈ మూడు ప్రాంతాలు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ అవుతుంది.
(ఆలాగే విద్యార్దులు ఆంధ్ర ప్రాంత భోదనా సిబ్బంది పై అనుచితంగా ప్రవర్తించటం,వారిని కొట్టడం,దుర్భాషలాడటం లాంటి సంఘటనలు వారి ఝుగుప్సకరమైన ప్రవర్తనకు తలదించుకోవలసిన విషయం..... హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై తెలంగాణ నాయకుల విగ్రహాలు ప్రతిష్టించాలని ధర్నా చేయటం లో తప్పు లేదు....కాని వాటి కోసం మిగిలిన తెలుగు జాతి యావత్తు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేయటం అనేది ఉన్మాద చర్య....యావత్ తెలుగు జాతి ని కించపరుస్తూ,అగౌరవ పరిచే చేర్య.....నిజంగా ఈ సంఘటన తెలంగాణ మీద భక్తి మాత్రం కాదు...అది ఆ ఘాతుకం చేసిన వారి దిగజారుడు తనానికి నిదర్శనం.
పొట్టిశ్రీరాములు గారి విగ్రహంపై రాళ్ళూ రువ్వటం ఆ పని చేసిన వారి అజ్ఞానానికి నిదర్సనం...అయిన ఆమరణ నిరాహారదీక్ష చేసింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కోసం..తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రము కావాలని అయిన ప్రాణాలు అర్పించారు అది 1952 లో ..కానీ..తెలంగాణా రాయలసీమ కోస్తా ప్రాంతాలు కలవాలని కాదు...నవంబర్ 1,1953 లో ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది..1956 లో పెద్దమనుషుల ఒప్పందం మీద తెలంగాణా ఆంద్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ప్రకటించ బడ్డాయి. తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలు కలవటానికి అయిన బాధ్యుడు కాదు.. )


జై తెలంగాణ.........జై రాయలసీమ.......జై కోస్తా ఆంధ్ర ........జై జై తెలుగు రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ ).

No comments:

Post a Comment